3,116కోట్లతో టీటీడీ బడ్జెట్
Posted On February 20, 2019
*ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయ అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను అధికారులు పాలకమండలి ముందుంచగా దానిపై చర్చంచిన అనంతరం బోర్డు ఆమోదం తెలిపింది. హుండీ ద్వారా రూ.1,231కోట్లు, పెట్టుబడులపై వడ్డీ 845.86కోట్లు, ఇతర మార్గాల్లో రూ.1,039.39కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అలాగే వ్యయాల్లో అత్యధికంగా ఉద్యోగుల జీతాలు తదితరాలకు రూ.625కోట్లు అవసరమని అంచనా వేశారు.
*వివిధ ప్రదేశాల్లో ఆలయాల నిర్మాణానికి రూ.100కోట్లు, రహదారులకు రూ.210కోట్లు కేటాయించారు. హిందూ ధర్మపరిరక్షణ కార్యక్రమాలకు రూ.179కోట్లు, విద్యకు రూ.127.5 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు రూ.139కోట్లు ఖర్చు అంచనా వేసినట్టు చైర్మన్ తెలిపారు. అలాగే.
- పద్మావతి విశ్రాంతి గృహంలో రూ.4.95కోట్లతో వంటశాల విస్తరణ, పాంచజన్యం విశ్రాంతి గృ హం వెనుక రూ.12.5కోట్లతో వంటశాల నిర్మాణం.
- కల్యాణి డ్యామ్ స్టేజ్-1(శ్రీనివాసమంగాపురం) నుంచి స్టేజ్-2 (శ్రీవారిమెట్టు) వరకు అదనపు పైపులైన్ ఏర్పాటుకు రూ.8.5కోట్లు మంజూరు
- తిరుపతిలో శ్రీనివాస, పద్మావతి కల్యాణ మంటపాల ఆధునీకరణకు రూ.8.32కోట్లతో టెండరు ఆమోదం.
- తిరుమలలోని శంఖుమిట్ట కాటేజీల ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులకు రూ.5.15 కోట్లు, బీ టైప్ క్వార్టర్స్ వద్ద అదనపు యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.47.44కోట్లు, ఎఫ్ టైప్ క్వార్టర్స్‌లో ఉన్న 76గదులను సూట్లుగా మార్చడానికి రూ.3.65కోట్లు మంజూరు.
- శ్రీవారి పోటు ‘ఉగ్రాణం’లో పనిచేసే కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితి మరో ఏడాది పొడిగింపు.
*Director: Putta Sudhakar Yadav