భారత్‌కు 24 అధునాతన సీహాక్ హెలికాప్టర్లు
Posted On April 04, 2019
*భారత్‌కు ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
*హిందూ మహాసముద్రంలో చైనా విస్తరిస్తున్న వేళ ఈ హెలికాప్టర్లు భారత నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని పెంచనున్నాయి
వీటి ప్రత్యేకతః
* భారత నౌకాదళం వద్ద ప్రస్తుతం పాతబడిపోతున్న సీకింగ్ హెలికాప్టర్లు(బ్రిటన్) ఉన్నాయి. వాటి స్థానంలో ఈ అధునాతన లోహ విహంగాలను ప్రవేశపెడతారు.
*సముద్ర లోతుల్లో సంచరించే శత్రు జలాంతర్గాములను వేటాడటం
* యుద్ధనౌకలను విధ్వంసం చేయగలవు, విపత్తు సమయంలో సహాయ చర్యలకు ఉపయోగపడతాయి.
ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ః
*అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు.
* లాక్‌హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది..
* సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది.
* 2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది.
* జూలై 2001లో తొలి హెలికాప్టర్ తయారైంది.
* ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
* 1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్ ఇంజన్లను దీనికి అమర్చారు
భారత నావికా దళం:
- 17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.
- నౌకాదళ దినోత్సవం(అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు
- స్థాపన:1612
- ప్రస్తుత చీఫ్: సునీల్ లంబ
- తదుపరి చీఫ్:కరం బీర్ సింగ్