'అఫ్ఘాన్‌లో భారత్ పాత్ర'
Posted On November 23, 2019
*'అఫ్ఘాన్‌లో భారత్ పాత్ర' అనే అంశంపై హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో సదస్సు నిర్వహించారు.
* అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి భారత్ అందిస్తున్న సహకారాన్ని అమెరికా స్వాగతించింది. అఫ్ఘాన్ నుంచి తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ సాయాన్ని కొనసాగించడాన్ని అమెరికా ప్రశంసించింది.
*2001లో తాలిబన్లపై అమెరికా పోరాటానికి దిగిన నాటి నుంచి భారత్ మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందజేసింది.
* ఈ సమావేశంలో పాల్గొన్న అఫ్గానిస్థాన్ పునర్‌నిర్మాణంలో భారత్ కీలక పాత్రం పోషిస్తూ వస్తుందని అమెరికా పేర్కొంది.
* ఇప్పటి వరకు వివిధ రంగాల్లో 400 ప్రాజెక్టులను పూర్తి చేసింది. మరో 150 నిర్మాణ దశలో ఉన్నాయి.
అమెరికన్లు తాలిబాన్లతో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో, అందుకు అమెరికా ప్రయత్నిస్తుంది.