ఫిబ్రవరిలో ట్రంప్ భారత్ పర్యటన
Posted On January 29, 2020
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.
*డొనాల్డ్ ట్రంప్ పర్యటన అంశాలు---
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో ట్రంప్ రెండు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్, అప్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాలలో పెరుగుతున్న ఉగ్రవాదంపై చర్చించనున్నారు.
చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప భారత్‌తోనూ ఆ తరహా విధానాన్ని అమలు చేసేందుకు చర్చ జరిపే అవకాశం ఉంది.
దీంతో పాటు యుఎస్ నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై చర్చ.
జీఎస్పీ ఉపసంహరణ తర్వాత భారతదేశం తన సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ 6 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుతుంది.ఈ ఒప్పందాన్ని అధిగమించడానికి చమురు లేదా షేల్ గ్యాస్‌పై హామీలు పొందాలని భారత్ భావిస్తుంది.