తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి
Posted On May 05, 2020
- తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయసేన్‌రెడ్డి హైకోర్టు ప్రాంగణంలో చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా మే 2న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు.
- పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
- ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.