విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ తో రిలయన్స్ జియో జట్టు
Posted On May 11, 2020
రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ. 11,367 కోట్లు. మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించింది. ఈ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. ఆర్ఐఎల్, ఫేస్‌బుక్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్‌లలో విస్టా అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరిస్తుంది.
మూడు డీల్స్‌లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ | : రూ. 60,596 కోట్లు |
ఫేస్‌బుక్ పెట్టుబడి (9.99 శాతం వాటా) | : రూ. 43,574 కోట్లు |
విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ (2.32 శాతంవాటా) | : రూ. 11,367కోట్లు |
సిల్వర్ లేక్ పెట్టుబడి (1.15 శాతం వాటా) | : రూ. 5,666 కోట్లు |
జియో ఎంటర్‌ప్రైజ్ విలువ | : రూ. 5.16 లక్షల కోట్లు |