అబార్షన్ మహిళల సంపూర్ణ హక్కు కాదు -కేంద్రం
Posted On December 17, 2019
* అబార్షన్ అనేది మహిళల సంపూర్ణ హక్కు కాదని కేంద్రం తెలిపింది.
*అసురక్షిత గర్భవిచ్ఛిత్తి (అబార్షన్ల) వల్ల 8 శాతం మాతృ మరణాలు సంభవిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
* ఈ నేపథ్యంలో 1971 మెడికల్ టెర్మినేషన ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టంలోని నిబంధనలను తప్పక అనుసరించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
*'గర్భం దాల్చిన మహిళకు అబార్షన్‌పై సంపూర్ణ హక్కు లేదు. అసురక్షిత గర్భవిచ్చిత్తి వల్ల సంభవించే మాతృ మరణాలను తగ్గించేందుకు అబార్షన్‌ను చట్టబద్ధం చేసేందుకు ఎంటీపీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
*కేంద్ర ప్రభుత్వం ప్రకారం,ఇందులో పేర్కొన్న నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ఉల్లంఘన కిందకు రావు.
* ఎంటీపీ చట్టంలోని సెక్షన్ 3, 5 నిబంధనలు తమ ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయంటూ ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
*ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై కేంద్రం నుంచి సమాధానం కోరగా ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
*అబార్షన్ల కారణంగా పెరుగుతున్న తల్లి బిడ్డ మరణాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిస్తే ఎక్కడా రాజీ పడకుండా సురక్షిత అబార్షన్లు చేయాల్సిన బాధ్యత కూడా తీసుకుంటామని కేంద్రం చెప్పింది. ఈ క్రమంలోనే పిటిషనర్ సెక్షన్ 3 మరియు సెక్షన్ 5 కింద డిక్లరేషన్ అడుగుతుంటే దానిని కొట్టివేయాలని కోరుతూ అఫిడవిట్‌లో పేర్కొంది కేంద్రం.
* ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే విచారణ చేయనున్నారు.
*.గర్భం దాల్చిన మహిళకు ప్రాణహాని ఉందని పరీక్షల్లో తేలితేనే అబార్షన్ చేయొచ్చనేది సెక్షన్ 3 మరియు సెక్షన్ 5లో పొందుపర్చారు. ఆ సమయంలో డాక్టర్లు అనుసరించాల్సిన తీరును కూడా వివరిస్తూ ఎంటీపీ చట్టంలో పొందుపర్చారు.