భారత్‌కు ప్రపంచ బ్యాంకు వంద కోట్ల డాలర్ల ప్యాకేజీ
Posted On May 16, 2020
సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద భారత్‌కు ప్రపంచ బ్యాంకు సుమారు వంద కోట్ల డాలర్లు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్యాకేజీ లింకై ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. భారత ప్రభుత్వంతో మూడు రంగాల్లో వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోనున్నట్లు వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరక్టర్ జునైద్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ, చిన్నమధ్యతరహా పరిశ్రమల కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.