జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం
Posted On April 30, 2020
ఆంధప్రదేశ్‍లో మరో కొత్త పథకం ప్రారంభం అయింది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నారు. ఈ పథకం కింద పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులు కూడా ఉన్నత స్థానాలకు వెళ్లలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండేళ్లకు కలిపి రూ.4వేల కోట్లు విడుదల చేసింది.