వైఎస్‌ఆర్ కాపు నేస్తం - మార్గదర్శకాలు
Posted On January 29, 2020
వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం -- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు మహిళల జీవన ప్రమాణాలకు పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.ఒక్కో మహిళకు ఏడాదికి రూ. 15వేలు చొప్పున ఐదు సంవత్సరాలకు రూ. 75వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1101.69 కోట్లు కేటాయించారు.
*వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం మార్గదర్శకాలు ---బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికాలవలవన్ ఉత్తర్వులు జారీ చేశారు.
లబ్ధి పొందే మహిళ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారై ఉండాలి.
కుటుంబ నెలవారి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 10వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 12 వేలు కంటే తక్కువుగా ఉండాలి.
మూడు ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల కంటే తక్కువ కలిగి ఉండాలి.
. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా పెన్షన్ దారులైనా అటువంటి వారు అనర్హలు.
పై నిబంధనలు పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది.
కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు.ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది.
కుటుంబ సభ్యులు ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
మునిసిపాలిటీ ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తులు లేని వారు, 750 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో నివాస గృహాలు కానీ వ్యాపార సంబంధిత భవనాలు కలిగిన వారు అర్హులు.
తప్పని సరిగా లబ్ధిదారుని వయసు 45 ఏళ్లు నుంచి 60 ఏళ్ల లోపల ఉండాలి.
వయసును ధృవీకరించే కులం, పుట్టిన తేది, స్థానికత వివరాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కుల సర్టిఫికేట్, పుట్టుక ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మార్కుల జాబితా, ఓటర్ ఐడి కార్డు, రాష్ట్ర ప్రభుత్వం చేత జారీ చేయబడిన పెన్షన్ కార్డును ఆధారాలుగా కలిగి ఉండాలి.
లబ్ధిదారుని పేరుతో ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
ఇంటింటి సర్వే ఆధారంగా గ్రామ, వార్డు వలంటీర్లు అర్హులను గుర్తిస్తారు.
*నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. పథకానికి ఎంపికైనట్లు, నగదు బ్యాంకులో జమచేస్తున్నట్లు తదితర వివరాలతో పాటు ముఖ్యమంత్రి సమాచారంతో కూడిన పత్రాన్ని లబ్ధిదారులకు వలంటీర్లు అందజేస్తారు.ఈ పథకం అమలు కోసం కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించనున్నారు.