గతంలో మాదిరి కాకుండా ఈ విద్యాసంవత్సరం కేవలం మూడు ఫేజుల్లోనే డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లను పూర్తి చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి,
దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఉద్యోగావకా శాలు ఎక్కువగా ఉన్న బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ఎనలిటిక్స్ కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సోమవారం తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల మేనే జ్మెంట్ల సంఘం ఆధ్వర్యంలో పలు యూనివ ర్సిటీల అధికారులు, కాలేజీల మేనేజ్మెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ జూన్ 20 తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉందన్నారు.