1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చి, ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్య నిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
బి) 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనికీ 20 సం||ల వ్యాపార అనుమతిని ఇచ్చింది.
సి) బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్‌లను బెంగాల్ గవర్నర్ జనరల్‌కు ఆధీనులుగా చేయడం జరిగింది.
డి) ఈస్ట్ ఇండియా కంపెని అధికారుల వ్యాపార లావాదేవీలను ప్రోత్సహిస్తువారు ప్రజల నుండి బహుమతులు తీసుకోనే అవకాశాన్ని ప్రోత్సహించింది.
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి మరియు డి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
1784 పిట్స్ ఇండియా చట్టం గురించి సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన విభాగాన్ని 6 సభ్యులతో ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ, సైనిక మరియు రెవిన్యూ వ్యవహారాలను దీనికి అప్పగించారు.
బి) వాణిజ్య వ్యవహారాలను పర్యవేక్షణచే బాధ్యతను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కు అప్పగించారు.
సి) గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య 4 నుండి 6 కు పెంచారు.
(A)ఎ,బి సరి అయినది (B)బి,సి సరి అయినవి (C)ఎ,సి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
1833 చార్టర్ చట్టంనకు సంబంధించి సరికాని అంశంను గుర్తించుము?
(A)గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని భారత గవర్నర్ జనరల్‌గా మార్చారు. (B)భారతీయ శాసనాలను క్రోడికరించడానికి ఒక భారతీయ 'లా' కమీషన్‌ను నియమించారు. (C)1833 చార్టర్ చట్టంను భారతదేశంలో కేంద్రీకృతపాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు. (D)కంపెనీ పాలనను మరొక 20 సం||రాలు పొడిగించలేదు.
1858 భారత ప్రభుత్వ చట్టంనకు సంబంధించి సరి అయిన వాటిని గుర్తించుము.
ఎ) భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయ్ అనే పదవులు ఆవిర్భవించాయి.
బి) బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దు అయినది.
సి) బ్రిటీష్ మంత్రి వర్గంలో భారతరాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించడం జరిగింది.
డి) భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైశ్రాయ్ పదవిని 6 సం||రాల కాలానికి నియమించడం జరిగింది.
(A)ఎ,బి సరి అయినవి (B)సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి,డి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
1919 భారత ప్రభుత్వ చట్టం గురించి సరి అయిన వాటిని గుర్తించండి?
ఎ) భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పరిచింది.
బి) కేంద్ర, రాష్ట్రాల మధ్యగల పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే రెండు జాబితాలలో పేర్కొనడం జరిగింది.
సి) భారతీయులకు ఆస్తి మరియు పన్ను చెల్లించే ప్రాతిపదకపై పరిమితమైన ఓటు హక్కును కల్పించారు.
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)ఎ,సి సరి అయినవి
సైమన్ కమీషన్ సిఫార్సులకు సంబంధించి సరికాని అంశంను గుర్తించుము?
(A)షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది సైమన్ కమీషన్. (B)భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. (C)సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించాలి. (D)ఏకకేంద్ర వ్యవస్థ భారతదేశానికి సరిపడదు కనుక సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
వివరణ (ఎ) :- భారతీయులకు రాజ్యాంగాన్ని రచించే సామర్థ్యం కలదు అని 1920 దశాబ్దంలోనే రుజువైంది.
కారణం (ఆర్) :- 1928 లో భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా అని సవాలు విసిరిన భారత వ్యవహారాల మంత్రి సవాలును స్వీకరించిన కాంగ్రెస్ మరియు ఇతర రాజకీయ పార్టీలు మొతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘంను నియమించగా ఉపసంఘం తక్కువ రోజుల్లోనే అద్బుతమైన ప్రాథమిక హక్కులతో కూడిన నివేదికను తయారు చేసి భారతీయుల రాజ్యాంగ రచనా సామర్థ్యంను నిరూపించింది.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏకకేంద్రంగా ఉండాలా అనే అంశం మీద చర్చ జరిగింది.
బి) రెండు కొత్త ముస్లిమ్ మెజార్టీ ప్రావిన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించే సరికి బ్రిటీష్ ప్రభుత్వాన్ని గాంధీజీ నిందించారు.
సి) మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు (సిఫారసులు) ప్రకటించలేదు.
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)సి,ఎ సరి అయినవి
1935 భారత ప్రభుత్వ చట్టంనకు సంబంధించిన కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించి సరికానిది?
(A)ఫెడరల్ (కేంద్ర) జాబితా - 59 అంశాలు (B)ప్రోవిన్షియల్ (రాష్ట్ర) జాబితా - 54 అంశాలు (C)ఉమ్మడి జాబితా - 36 అంశాలు (D)అవశిష్ట జాబితా - ప్రొవిన్షియల్‌లకు ఇచ్చారు
ప్రవచనం (ఎ) :- 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలుగా భావిస్తారు.
కారణం (ఆర్) :- భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలను స్వీకరించారు.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
ప్రవచనం (ఎ) :- రాజ్యాంగ సభ ఏర్పాటు గురించి ప్రతిపాదించిన మొదటి బ్రిటీష్ కమిటి క్రిప్స్ కమిటి
కారణం (ఆర్) :- క్రిప్స్ ప్రతిపాదనలను భారత జాతీయ నాయకులు స్వాగతించారు.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
ప్రవచనం (ఎ) :- 1946 వ సంవత్సరంలో భారతదేశంలో పర్యటించిన బ్రిటన్ కేబినెట్ మంత్రుల రాయబార బృందం పాకిస్తాన్ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు అని ప్రకటించింది.
కారణం (ఆర్) :- మౌంట్ బాటన్ ప్రణాళిక-1947 మాత్రం ఇండియన్ యూనియన్ నుండి భారతదేశం, పాకిస్తాన్ అను రెండు దేశాలు ఏర్పడతాయి అని ప్రకటించింది.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
రాజకీయ పార్టీల వారీగా రాజ్యాంగ పరిషత్తు ఎన్నిక ఫలితాలకు సంబంధించిన వాటిని జతపరుచుము?
రాజకీయ పార్టీ పేరు గెల్చుకున్న స్థానాలు
A) జాతీయ కాంగ్రెస్ పార్టీ i) 204
B) ముస్లీం లీగ్ ii) 202
C) షెడ్యూల్డు జాతుల ఫెడరేషన్ iii) 75
D) యూనియనిస్ట్ మహ్మదీయులు iv) 3
v) 73
vi) 1
రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు
విషమ నిర్ణయ కమిటి
A) కేంద్ర ప్రభుత్వాధికారి కమిటి i) బి.ఆర్. అంబేద్కర్
B) ముసాయిదా రాజ్యాంగ రచనా ii) వల్లభాయ్ పటేల్
కమిటి
C) రాజ్యాంగ సలహా సంఘం iii) డా|| రాజేంద్రప్రసాద్
D) జాతీయ పతాక తాత్కాలిక కమిటి iv) జవహర్‌లాల్ నెహ్రూ
క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) 3వ పంచవర్ష ప్రణాళికలో దీర్ఘదర్శి స్వభావం మనకు కనిపిస్తుంది.
బి) 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మొదటిసారిగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్‌లో మనకు మిగులు కనపడుతుంది.
సి) భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించి అమలు చేసింది గున్నార్ మిర్ధాల్
డి) ప్రొ|| రాజ్‌కృష్ణ పేర్కొన్న ''హిందూ వృద్ధిరేటును'' అధికమించి వృద్ధిరేటును సాధించిన మొదటి ప్రణాళిక 5వ ప్రణాళిక
(A)ఎ,బి సరి అయినవి (B)ఎ,బి,సి సరి అయినవి (C)బి,సి,డి సరి అయినవి (D)ఎ,బి,సి,డి సరి అయినవి
6వ పంచవర్ష ప్రణాళిక గురించి సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత తగ్గించి అవస్థాపన సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
బి) 6వ ప్రణాళిక అనుకున్న దానికంటే తక్కువగా వృద్ధిరేటు నమోదు చేసింది.
సి) 6వ ప్రణాళికను నిరుద్యోగ నిర్మూలనా ప్రణాళికగా పిలుస్తారు.
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)ఎ,సి, సరి అయినవి
ప్రవచనం (ఎ) :- వార్షిక ప్రణాళికల కాలంలో దేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది?
కారణం (ఆర్) :- పంచవర్ష ప్రణాళికల రూపకర్తలు హరిత విప్లవంనకు సుముఖంగా లేరు?
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడు
A) మూడవ పంచవర్ష ప్రణాళిక i) డి.ఆర్. గాడ్గిల్
B) మొదటి పంచవర్ష ప్రణాళిక ii) ఎన్.డి. తివారి
C) నాల్గొవ పంచవర్ష ప్రణాళిక iii) అశోక్ మెహతా
D) ఆరవ పంచవర్ష ప్రణాళిక iv) గుల్జారీలాల్ నంద
పంచవర్ష ప్రణాళికలు రూపకర్త
A) మొదటి పంచవర్ష ప్రణాళిక i) పి.సి. మహల నోబిస్
B) రెండవ పంచవర్ష ప్రణాళిక ii) పీతాంబరం సేఠ్ మరియు అశోక్ మెహతా
C) మూడవ పంచవర్ష ప్రణాళిక iii) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
D) నాల్గొవ పంచవర్ష ప్రణాళిక iv) డి.ఆర్. గాడ్గిల్