-->

TS TET Maths & Science Grand Tests (PKG-334) Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 450 MCQs found
ఒక శిశువు బొమ్మును మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం.
(A)   వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు.
(B)   వికాసం పరస్పర సంబంధగా ఉంటుంది.
(C)   వికాసం శిరః పాదాభిముఖంగా కొనసాగుతుంది.
(D)   వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది.


Show Answer


ఈ క్రింది వాటిలో కౌమారదశలో ఉద్వేగవికాసానికి సంబంధించని లక్షణము?
(A)   సాధారణ ఉత్తేజం
(B)   ఉద్వేగ అస్థిర
(C)   భయం మరియు వ్యాకులత 
(D)   సందిగ్ధత మరియు అనిశ్చితి


Show Answer


ఒక విద్యార్ధిని, తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన "నక్షత్రం (star)" ను నిలబెట్టుకోనుటకై కష్టపడి చదువుతున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో "నక్షత్రం" ను వదలుకోవలసి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనం.
(A)   ఋణాత్మక పునర్బలనం
(B)   ధనాత్మక పునర్బలనం
(C)   ప్రాథమిక పునర్బలనం
(D)   దండన


Show Answer


ఒక ఎనిమిదవ తరగతి విద్యార్థిని, తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు.
(A)   అనుకూల
(B)   ప్రతికూల
(C)   బదలాయింపు జరుగదు
(D)   ద్విపార్శ్వ 


Show Answer


కింది వాటిలో అభ్యసనకు సంబంధించి, NCF-2005 సూచించింది:
(A)   అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి.
(B)   ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి.
(C)   అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి.
(D)   అభ్యససం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి.


Show Answer


ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి?
(A)   అభ్యసన వనరుగా 
(B)   విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా
(C)   తరగతి బోధనాభ్యసనమునకు విద్యార్థులను వేరు చేయుటకు గాను
(D)   ఉపాధ్యాయునికి భారంగా


Show Answer


వ్యక్తి వికాసం ఫై  ప్రభావం చూపించే శారీరక కారకం?
(A)   ఉష్ణోగ్రత 
(B)   ఆహారము 
(C)   హార్మోన్లు 
(D)   కాంతి 


Show Answer


ఒక ఐదవ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది.
(A)   సంజ్ఞానాత్మక
(B)   క్రియావృత్తి
(C)   భావావేశ
(D)   మానసిక - చలనాత్మక


Show Answer


సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రము
(A)   ప్రక్షేపణం
(B)   హేతుకీకరణం
(C)   పరిహారం
(D)   తదాత్మీకరణం 


Show Answer


పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించక పోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేక పోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం?
(A)   వ్యక్తిగత
(B)   పరిసరాత్మక
(C)   వ్యక్తిగత మరియు పరిసరాత్మక
(D)   వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు


Show Answer


పియాజె, సంజ్ఞానాత్మక సిద్ధాంతము ప్రకారం, శిశువు ఆటలాడేటపుడు జీవంలేని కొన్ని ఆటవస్తువులకు  జీవాన్ని ఆపాదించుట?
(A)   వస్తుస్థిరత్వం
(B)   సర్వాత్మవాదం
(C)   వ్యవస్థీకరణ
(D)   విపర్యయాత్మకం


Show Answer


కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
(A)   బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ.
(B)   బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ, అభ్యసన పరస్పర చర్యాత్మక ప్రక్రియ.
(C)   బోధన మరియు అభ్యసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే.
(D)   బోధన మరియు అభ్యసన రెండు కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే.


Show Answer


ఉన్నత పాఠశాలలన్నింటికీ అత్యాధునికమైన విద్యాసాంకేతికతను అందించినట్లయితే ....?
(A)   ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది.
(B)   ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నింటినీ నిర్వహించగలడు.
(C)   'ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయున్ని' కల్పిస్తే సరిపోతుంది.
(D)   ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము.


Show Answer


నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు ...?
(A)   అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు.
(B)   పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతావు.
(C)   సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు అతనికి మార్గదర్శకత్వము ఇస్తావు.
(D)   ఉపాధ్యాయుల సూచనలను పాటించవని చెబుతావు.


Show Answer


'సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యసన సిద్దాంతం' ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర ...?
(A)   ప్రదర్శకుడు
(B)   బోధకుడు
(C)   సౌకర్యకర్త
(D)   ప్రేక్షకుడు


Show Answer


అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది?
(A)   అభ్యసనం పూర్తి అగుట
(B)   అభ్యసనం ప్రారంభమగుట
(C)   అభ్యససంలో వేగం పెరుగుట
(D)   అభ్యసనంలో తాత్కాలిక నిలకడ


Show Answer


హావిఘర్స్ట్ ప్రకారం, 'వికాస కృత్యాలు'?
(A)   సాంఘిక అంచనాలు
(B)   వైద్య ప్రమాణాలు
(C)   అభ్యసన ఆసక్తులు
(D)   విద్యాపరమైన మైలురాళ్ళు


Show Answer


ఈ క్రింది వానిలో అభ్యసమునకు సంబంధించి సరైనది?
(A)   ప్రక్రియ మరియు కంఠస్థములకు ప్రాధాన్యతనిచ్చుట.
(B)   ఫలితము మరియు ఉద్యోగకల్పనకు ప్రాధాన్యతనిచ్చుట.
(C)   పరీక్షల్లో విజయానికై ప్రాధాన్యతనిచ్చుట.
(D)   ప్రక్రియ మరియు ఫలితములు ప్రాధాన్యతనిచ్చుట.


Show Answer


బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక సిద్ధాంతము ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ.........?
(A)   చిత్ర - ప్రతిమ 
(B)   క్రియాత్మక / నటనాత్మక 
(C)   సమాచార ప్రాతినిధ్య 
(D)   ప్రతీకాత్మక 


Show Answer


RTE - 2009 చట్టం ప్రకారం ఈ వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు?
(A)   3 - 12 సంవత్సరాలు 
(B)   4 - 13 సంవత్సరాలు 
(C)   5 - 14 సంవత్సరాలు 
(D)   6 - 14 సంవత్సరాలు 


Show Answer


  • Page
  • 1 / 23