తెలంగాణలో తొలి కవిగా పేరొందిన పాల్కురికి సోమనాధుడు జన్మ స్థలమైన జనగామా జిల్లాలోని పాలక్తుని ఎన్ని కోట్ల వ్యయంతో అభివృద్ధిపరచాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయిం చింది?
(A)5 కోట్ల వ్యయంతో (B)2 కోట్ల వ్యయంతో (C)6 కోట్ల వ్యయంతో (D)8 కోట్ల వ్యయంతో
ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూడిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి క్రింది వానిలో సరైనవేవి?
1. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు.
2. ఉన్నత విద్యా సంస్థ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
3. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
(A)కేవలం 1 మాత్రమే (B)కేవలం 2 మాత్రమే (C)కేవలం 2, 3 మాత్రమే (D)పైవన్నీ సరైనవే
దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కమిషన్ కి ఎవరు నేతృత్వం వహించనున్నారు?
(A) పి.వెంకట రామారెడ్డి (B) ఆర్.బసంత్ (C)జస్టిస్ పద్మనాభన్ (D)పైవారు ఎవరు కాదు
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్వహించిన భారతదేశ విపత్తు ప్రతిస్పందన సమావేశాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
ఒక కళాశాల విద్యార్థి మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నిక కావాలని కోరుకున్నాడు. పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులలో ఆ విద్యార్థి నామినేషన్ యొక్క చెల్లుబాటు కాలం ఈ క్రింది ఏ అంశంపై ఆధారపడి వుంటుంది........
(A)కళాశాల ప్రిన్సిపాల్ అనుమతి పొందాలి (B)ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం కలిగి వుండాలి. (C)ఓటర్ల జాబితాలో అతని పేరు ఉండాలి. (D)అతని ప్రమాణ పత్ర ధృవీకరణ రాజ్యాంగానికి విధేయతను కలిగి ఉండాలి
సల్పర్ డై ఆక్సైడ్ (ఎస్‌ఓ2) ఉద్గారాలు ప్రపంచంలోనే అత్యధికంగాఎక్కడ నుంచి వెలువడుతున్నాయని అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది.
ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రింది వానిలో ఆమె పొందిన అవార్డు...?
(A)అన్నా పొలిటికొస్తావా (Anna Politkovskaya) (B)పద్మశ్రీ (C)బుకర్ ప్రైజ్ (D)కేంద్ర సాహిత్య అకాడమీ
సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ 115వ జయంతి, సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతిని 2017 అక్టోబర్ 11న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోర్టల్ ఏది?